గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ చిత్రాన్ని ఒకరోజు ముందు డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏపీలో ప్రీమియర్ షోలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే, టికెట్ రేటుపై డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ప్రీమియర్స్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఛైర్మన్ అయిన దిల్ రాజుపై మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్ర రైట్స్ కొన్నది కూడా ఆయనే కావడం ఇక్కడ కలిసొచ్చే అంశం.
ప్రీమియర్స్‌తోనే తాండవం ఆడటానికి బాలయ్య అండ్ టీమ్ రెడీ అవుతోంది. మరి ఈ చిత్రానికి ప్రీమియర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో వేచి చూడాలి. సంయుక్త హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.


