పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరో అంటే రాజేంద్రప్రసాద్ అంతేకాకుండా ప్రయోగాలు చెయ్యడంలో తనదయిన శైలి ఎప్పటికీ మానుకోలేదు. అలా చేసిన ఒక ప్రయోగమే గత శుక్రవారం విడుదలయిన “డ్రీం”. ఈ చిత్రం గురించి ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు ఈ చిత్రాన్ని దర్శకుడు మొదట బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి ఈ కథను చెప్పారంట. తెలుగు మరియు హిందీలో తెరకెక్కించాలని దర్శకుడి నిర్ణయం అని తెలిసిన అమితాబ్ తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరితో తీస్తున్నావ్ అని అడిగితే రాజేంద్ర ప్రసాద్ అని దర్శకుడు చెప్పారంట. ముందు అతనితో చెయ్యి తరువాత నేను చేస్తాను అని చెప్పారట. రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడి చిత్రాలే అనుకున్నాను ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తారని అనుకోలేదు అని అమితాబ్ అన్నారట. అమితాబ్ గతంలో ఇలాంటి ఒక పాత్రనే “బ్లాక్” చిత్రంలో చేశారు. ఇక్కడ కిక్ అవ్వని ఈ చిత్రాన్ని అమితాబ్ చేస్తారో లేదో చూడాలి మరి.