దాదాపుగా పూర్తయిన రాజశేఖర్ “అర్జున”

దాదాపుగా పూర్తయిన రాజశేఖర్ “అర్జున”

Published on Apr 9, 2012 9:30 PM IST


యాంగ్రీ యంగ్ మాన్ గా పేరొందిన నటుడు డా. రాజశేఖర్ త్వరలో ఈయన అర్జున చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఈయన ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నారు. రాజకీయ నేఫధ్యంలో సాగే ఈ చిత్రంలో రాజ శేఖర్ చిత్రం ఆసాంతం ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది పతాక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ లో ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ పర్యవేక్షణలో జరుగుతుంది. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే.చంద్ర శేకర్ మరియు ఏ.ఉదయ శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరియం జకారియా మరియు రేఖ కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం నిర్మాణం రేపటితో పూర్తవుతుంది నిర్మాణేతర కార్యక్రమాలు మొదలుపెట్టుకోనుంది.

తాజా వార్తలు