సినిమా ఇండస్ట్రీలో హీరోకు ఉండే క్రేజ్ మరో ఏ వ్యక్తికీ ఉండదు. అందుకే ఆర్ నారాయణ మూర్తి లాంటి వాళ్ళు హీరోగానే మిగిలిపోవాలని సైడ్ క్యారెక్టర్స్ కూడా వేయరు. ఇక సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి కిందామీదా పడుతూనే ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఏ కార్ యాక్సిడెంట్ తోనో ఏ కాంట్రవర్సీ స్పీచ్ లతోనే వార్తలు నిలిస్తున్నా ప్రస్తుతం తన తరువాత చిత్రం చాల సీరియస్ గా దృష్టి పెట్టాడు ఈ సీనియర్ హీరో.
‘పూలరంగడు, అహన పెళ్ళంట’ సినిమాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో సరికొత్త తరహా జోనర్ లో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలోని కీలకమైన సీన్స్ ను ఇప్పుడు జరిగే షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారు. ఎమోషనల్ గా సాగే ఆ సీన్స్ రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ అని.. సినిమాలో ఆ సెంటిమెంట్ హైలైట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ చిత్రానికి ఇంగ్లీష్ సినిమా ‘టోకెన్’ ప్రేరణ అట. ఆ మూవీలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారట.