టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కింగ్డమ్’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసి విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ చిత్రాలను కూడా ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమాను ఓకే చేశాడు ఈ హీరో.
అయితే, రౌడీ స్టార్ కోసం ఓ సీనియర్ హీరో ఇప్పుడు విలన్‌గా అవతారమెత్తనున్నాడు. యాంగ్రీ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రాజశేఖర్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సాలిడ్ కమ్‌బ్యాక్‌తో స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ‘రౌడీ జనార్ధన్’ చిత్రంలో విలన్ పాత్రలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవికిరణ్ కోల డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో రాజశేఖర్ కూడా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.