అడ్వెంచర్ థీంతో రాజమౌళి – ప్రభాస్ సినిమా

అడ్వెంచర్ థీంతో రాజమౌళి – ప్రభాస్ సినిమా

Published on Nov 22, 2012 1:15 PM IST


టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది మరియు ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రాజమౌళి అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇప్పటివరకూ మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా చూపించిన అడ్వెంచర్ థీంతో ఈ సినిమా కథ ఉండనుంది. ఈ సినిమాకోసం ఎక్కువగా గుర్రాలను తెప్పించనున్నారు అలాగే హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్ ని సిద్దం చేస్తున్నారు.

కాస్ట్యూమ్ డిజైనర్ రామా రాజమౌళి మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి తప్ప మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ సినిమా రాజమౌళి – ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సుమారు 65 -70 కోట్లతో తెరకెక్కనుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు