ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ పూణే లో మొదలుకావాల్సి వుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో వాయిదాపడింది. అలాగే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. దీనితో సమీప కాలంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే రాజమౌళి పూణే షెడ్యూల్ కి సంబంధించిన ఓ భారీ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించే ఆలోచనలో ఉన్నారట.
సాబు సిరిల్ నేతృత్వంలోని టీమ్ ఓ భారీ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకణ ఈ సెట్ లో చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి సినిమా కోసం గతంలో రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేయించారు. ఆ సెట్స్ ఇప్పటి కూడా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్ర ను చేస్తున్నారు.