థాయిలాండ్ వెళ్ళిన రాజమౌళి

థాయిలాండ్ వెళ్ళిన రాజమౌళి

Published on Dec 25, 2012 11:43 PM IST

Rajamouli
టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సవంత్సరాంతంలో పనికి కొంచెం గ్యాప్ ఇచ్చి హాలిడే తీసుకున్నారు. ‘ నా ఫ్యామిలీలోని నలుగురం కలిసి హాలిడే కోసం థాయిలాండ్ వెళుతున్నాం. డిసెంబర్ 31న తిరిగొచ్చి మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటామని’ రాజమౌళి ట్వీట్ చేసారు. ఈగ’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి రాజమౌళి కొన్ని రోజులు గోవా టూర్ వెళ్లివచ్చారు. అంతకముందు మర్యాద రామన్న సక్సెస్ తర్వాత యూరప్ లోని మెడిటెర్రానియన్ సముద్ర తీరానికి వెళ్ళారు.

ప్రభాస్ తో తీయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్న రాజమౌళి ఈ సినిమా కోసం ఇటీవలే ముంబైలో కొన్ని రోజులు గడిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించాలనుకుంటున్నారు. ఈ సినిమా పూర్తి వివరాలు 2013లో తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు