యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్లు నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తుంది. అల్లూరి సీతారామరాజు జీవితంలో సీత అనే పాత్ర ఉండడం, ఆయన మరదలి పాత్ర కావడంతో ఈ క్యారెక్టర్ కోసం అలియాభట్ను తీసుకున్నారు. అయితే సీత క్యారెక్టర్ కోసం అలియానే ఎందుకు ఎంపిక చేశారనే దానిపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి సీత అనే పాత్ర చాలా భావోద్వేగాలతో కూడుకున్న పాత్ర అని రామ్చరణ్, ఎన్టీఆర్లు ప్రతిభావంతులైన నటులని అందుకే ఈ పాత్రకు అలియా భట్ని తీసుకున్నట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించగా, ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ అగిపోయింది.