రాజమౌళి నెక్స్ట్ మహేష్ తోనే… జేమ్స్ బాండ్ మూవీనా?

రాజమౌళి నెక్స్ట్ మహేష్ తోనే… జేమ్స్ బాండ్ మూవీనా?

Published on Apr 18, 2020 1:11 PM IST

మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ దర్శకుడు రాజమౌళి తో చేయాలని. మూవీ లవర్స్ కూడా ఈ కాంబినేషన్ పై ఆసక్తితో ఉన్నారు. తీసిన హీరోలతో రెండ్ మూడు సినిమాలు చేసిన రాజమౌళి ఇంత వరకు మహేష్ తో మూవీ చేయలేదు. కొన్నేళ్ల క్రితం రాజమౌళిని ఓ ఇంటర్వ్యూ లో ఈ ప్రశ్న అడుగగా.. మహేష్ తో సినిమా కోసం నిర్మాత కె ఎల్ నారాయణ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, త్వరలో సినిమా ఉంటుంది అని చెప్పారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ మహేష్ బాబుతోనే అని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. ముందుగా చెప్పినట్లు నిర్మాత కె ఎల్ నారాయణ నిర్మాణంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందట. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. మరి ఈ మూవీ జోనర్ ఏమిటీ అనేది తెలియదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ మూవీ రానుందని వార్తలు వచ్చాయి. చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఆ భారీ చిత్రం ఈ స్థాయిలో తెరకెక్కనుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు