‘అంతక ముందు ఆ తరువాత’ని ప్రశంసించిన రాజమౌళి

‘అంతక ముందు ఆ తరువాత’ని ప్రశంసించిన రాజమౌళి

Published on Aug 27, 2013 5:00 PM IST

Rajamouli

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా బాగా నచ్చింది. రాజమౌళి తన కుటుంబంతో పాటు ఈ సినిమా చూసి సినిమా బాగుందని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

‘పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమాకి వెళ్లాను. కానీ ఎంజాయ్ చేశాను. రావు రమేష్, రోహిణి, అవసరాల శ్రీనివాస్, నా ఫ్రెండ్ వెంకట్ నటన బాగుంది. కొత్త అమ్మాయి ఇషా అందరిని బాగా ఆకట్టుకుంది. పరిణతి చెందినా వాడిగా సుమంత్ అశ్విన్ నటించిన సీన్స్ బాగున్నాయి. టీం అందరికి ‘అల్ ది బెస్ట్” అని ట్వీట్ చేశారు.

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, ఇషా హీరో హీరోయిన్ గా నటించారు.

తాజా వార్తలు