దసరా ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజాసాబ్’.. ట్రైలర్ ఆరోజే వస్తుందా..?

దసరా ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజాసాబ్’.. ట్రైలర్ ఆరోజే వస్తుందా..?

Published on Sep 28, 2025 2:03 AM IST

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అవగా, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.

కాగా, ఈ చిత్ర ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్‌ను సర్‌ప్రైజింగ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28న ఈ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని.. అయితే, అది కేవలం థియేటర్లలో మాత్రమే ప్లే చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

మరొక వార్తలో ఈ ట్రైలర్‌ను దసరా పండుగా ట్రీట్‌గా అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. మరి నిజంగానే రాజాసాబ్ ట్రైలర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు