తమిళనాడులోని కరూర్‌లో థలపతి విజయ్ (TVK అధ్యక్షుడు) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది మృతిచెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక లక్ష మందికి పైగా సభకు హాజరైనట్లు సమాచారం. గాయపడిన వారికి చికిత్స కోసం తిరుచ్చి, సేలం నుంచి అదనపు వైద్యులను ప్రభుత్వం పంపింది.
ఈ విషాద ఘటనతో ముఖ్యమంత్రి స్టాలిన్ తక్షణ వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనతో విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనపై అనిశ్చితి నెలకొంది.