పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి రోజే సుమారు రూ.150 కోట్ల గ్రాస్‌తో ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే, శుక్రవారం ఈ చిత్ర కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయి, రెండో రోజు కేవలం రూ.30 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.
శనివారం కూడా భారీ వర్షాలు కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో షోలు దెబ్బతిన్నాయి. దీంతో మొదటి వీకెండ్ కలెక్షన్స్ మీదే డిస్ట్రిబ్యూటర్ల భవితవ్యమంతా ఆధారపడి ఉంది.
అమెరికాలో మాత్రం ఓజీ రెండు రోజుల్లోనే $4 మిలియన్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకుపోతోంది. సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్, తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.