‘ఓజి’ రన్ కి టికెట్ ధరల ఎఫెక్ట్?

‘ఓజి’ రన్ కి టికెట్ ధరల ఎఫెక్ట్?

Published on Sep 27, 2025 6:01 PM IST

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ సొంతం చేసుకోగా ఇప్పుడు రెండో రోజు బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ అనుకున్న రేంజ్ లో ఉన్న టాక్ కి సంబంధం లేవనే టాక్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పలు చిత్రాలకి భారీ హైక్స్ ఇస్తున్నారు కానీ అవి కేవలం ఓపెనింగ్స్ రోజు మహా అయితే వీకెండ్ వరకు మాత్రమే వర్క్ అవుతున్నాయి.

మొదటి వీకెండ్ అంతా ఫ్యాన్స్ చూసుకున్నా కూడా అల్టిమేట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని రప్పించాలంటే వారికి తగ్గ ధరలు కూడా ఉండాలి. ఇదే మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓజి చిత్రానికి దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ అన్ని వర్గాల ఆడియెన్స్ ని రప్పించాలంటే తగు ధరలు ఉండాల్సిందే. అయితే సింగిల్ స్క్రీన్స్ లో పర్లేదు కానీ మల్టీప్లెక్స్ లాంటి వాటిలో మాత్రం డ్రాప్స్ బాగా ఉన్నాయి. సో ఈ హాలిడేస్ ని ప్లస్ చేసుకోవాలి అంటే టికెట్ ధరలు తగ్గించుకుంటే బెటర్ అని కొందరు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు