సమ్మర్ కానుకగా తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. రొమాంటిక్ చిత్రాల దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఒరేయ్ బుజ్జిగా మూవీ వేసవి కానుకగా విడుదల కానుంది. ఏప్రిల్ 3వ తేదీన సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. త్వరిత గతిన షూటింగ్ పూర్తి చేసి చెప్పిన ప్రకారం ఒరేయ్ బుజ్జిగా థియేటర్స్ లోకి తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.

ఇక ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో మాళవికా నాయర్ తరుణ్ కి జంటగా నటిస్తుంది. వీరి మధ్య ఆకట్టుకొనే లవ్ కెమిస్ట్రీ ఉంటుందని సమాచారం. మరో విశేషం ఏమిటంటే కుమారి 21ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ ని కూడా ఓ పాత్ర కొరకు తీసుకున్నారట. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన కుమారి 21 ఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీ సత్య సాయి ఫిలిమ్స్ పతాకంపై కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version