వాయిదా పడిన నేనేం చిన్నపిల్లనా చిత్రం

వాయిదా పడిన నేనేం చిన్నపిల్లనా చిత్రం

Published on Sep 24, 2013 9:03 PM IST

nenem-chinna-pillana

‘అందాలరాక్షసి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుని మరిన్ని ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తున్న రాహుల్ రవీంద్రన్ తాజా చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా’ ఈ నెల 27 న విడుదల కావాల్సివుంది.

కానీ అనుకోని పరిణామాల వలన ‘అత్తారింటికి దారేది’ సినిమా ముందుగా విడుదలవుతుండడంతో ఈ సినిమా వాయిదాపడింది. ఈ సినిమా ప్రాచారం కోసం రాహుల్ చెన్నైలో జరిగిన 100 ఏళ్ళ సినిమా పండుగకు సైతం హాజరవలేదు. నిజానికి ఈ సినిమాను హైదరాబాద్ లో చూపించడానికి తమ కుటుంబం మొత్తాన్ని ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ అవన్నీ ఇప్పుడు వ్యర్ధమయ్యాయి. ఈ సినిమా విడుదలతేదిను త్వరలోనే ప్రకటిస్తారు.

ఈ సినిమాకు డి. రామానాయుడు నిర్మాత. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. రాహుల్ సరసన తన్వి వ్యాస్ మరియు సంజన నటించారు. ఎం.ఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు