బిగ్‌బాస్ సీజన్-3లో విజేతగా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగింది. దాంతో రాహుల్ పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయంలోకి వెళ్తే.. రాహుల్, పబ్ కు వెళ్లగా అక్కడకి కొంతమంది వచ్చిన రాహుల్ పై దాడి చేసారని సమాచారం. తన పై దాడి చేసిన వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాహుల్ గచ్చిబౌలి పోలీసులను కోరాడు. దాడి చేసిన వ్యక్తుల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువు రితేశ్ రెడ్డితో పాటు మరో కొంతమంది ఉన్నారు.
ఇక తన పై జరిగిన దాడిలో తనకు పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదని అయితే ఈ కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు పూర్తిగా ఉందని రాహుల్ సిప్లిగంజ్ చెప్పారు. ఇక ఈ ఘటనలో తన తప్పు ఏమిలేదని.. తన పై అన్యాయంగా దాడి చేశారని.. కేవలం రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతోనే వాళ్ళు అల ప్రవర్తించారని రాహుల్ చెప్పుకొచ్చాడు.