ఈ విషయంలో “రాధే శ్యామ్” టీజరే డిసైడ్ చెయ్యాలి.!

ఈ విషయంలో “రాధే శ్యామ్” టీజరే డిసైడ్ చెయ్యాలి.!

Published on Feb 10, 2021 10:00 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం “రాధే శ్యామ్” మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించి బిజినెస్ పరంగా ఇప్పుడు పలు స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గాను ఇండియా వైడ్ డీసెంట్ గానే బిజినెస్ జరుగుతుంది కానీ అనుకున్న స్థాయిలో అయితే ఇంకా స్టార్ట్ కానట్టు తెలుస్తుంది.

ఇప్పటికే సినిమా చాలా లేట్ కావడం అంతే కాకుండా పెద్దగా డీటెయిల్స్ కూడా బయటకు రాకపోవడంతో ప్రభాస్ ముందు సినిమాల రేంజ్ లో బిజినెస్ మార్క్ ను ఇంకా అందుకోలేనట్టు తెలుస్తుంది. మరి ఇదంతా సెట్టవ్వాలి అంటే ఖచ్చితంగా టీజర్ తర్వాతే ఉంటుంది అని చెప్పాలి.

అందులో ఏదో ఒక మ్యాజిక్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియన్ లెవెల్లో రాధే శ్యామ్ హైప్ మరో లెవెల్ కు వెళ్తుంది. ఇక ఇప్పుడు అంచనాలు అన్నీ టీజర్ మీదనే పడ్డట్టు అయ్యాయి. మరి దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేసారో చూడాలి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు