“రాధే శ్యామ్” టీజర్ ఎంత సేపో కూడా లాక్ అయ్యిందా.?

“రాధే శ్యామ్” టీజర్ ఎంత సేపో కూడా లాక్ అయ్యిందా.?

Published on Feb 5, 2021 8:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా అనుకుంటున్న సమయంలో దీని టీజర్ కోసం కూడా చాలానే హంగామా నడుస్తుంది.

అసలు ఈ సినిమా ఉంటుంది అన్న దానిపై ఓ చిన్నపాటి క్లారిటీ రావాలి అంటే టీజర్ ను చూడాల్సిందే అని అంతా అనుకుంటున్నారు. అయితే మరి అది రావడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కు ఇపుడు డ్యూరేషన్ కూడా లాక్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ ను మేకర్స్ అద్భుతమైన విజువల్స్ ఒక నిమిషం 15 సెకండ్లు లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు