నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన ప్రభాసే ‘రాధే శ్యామ్’ కోసం షూట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి హాస్పిటల్ సెట్లను మేకర్స్ నిర్మించారు. ఇక్కడే షూట్ చేయాలని అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, రాధే శ్యామ్ టీమ్ ఇప్పుడు షూట్ కోసం ప్రత్యేక చార్టర్ ప్లైట్ లో ఇటలీకి వెళ్లాలని యోచిస్తోందని.. అంతర్జాతీయ ప్రయాణ నిషేధం పై సడలింపులతో యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి.