“రాధే శ్యామ్” టీం అప్డేట్స్ పై ప్లానింగ్ ఇలా ఉందా.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం తాలూకా టీజర్ ఇప్పుడు ఇంకొన్ని గంటల్లో రావడానికి రెడీగా ఉంది. అయితే మరి దీనితో పాటుగా ఈ చిత్రానికి సంబంధించి మరో టాక్ కూడా వినిపిస్తుంది.

రేపు విడుదల చెయ్యబోయే టీజర్ గ్లింప్స్ తో పాటుగా ఇక నుంచి వరుస పెట్టి అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక నుంచి సినిమా విడుదల అయ్యే వరకు కూడా ప్రతీ నెలా అప్డేట్స్ అప్ టు డేట్ ఇస్తారని టాక్ మొదలయ్యింది. మరి దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలి. మరి రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

Exit mobile version