ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ చేసిన భారీ చిత్రం రాధే శ్యామ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఇప్పుడు మిగిలి ఉన్న ఇతర చిన్నపాటి షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే హీరో హీరోయిన్ లు ఇద్దరిపై షూట్ అయ్యిపోయింది అంటే ఇక విడుదల పై దృష్టి పెట్టాల్సిందే..మరి అదే డైలమాలో మేకర్స్ ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఈ మధ్యనే ఎన్ని సినిమాలు విడుదల తేదీలు వచ్చేసాయో చూసాము. మరి ఇవి అలాగే పలు బాలీవుడ్ బడా చిత్రాల విడుదల తేదీలను చూసుకొని వాటన్నిటినీ భేరీజు వేసుకొని మేకర్స్ ఒక ఫైనల్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.