రచ్చ కల్లెక్షన్స్ 13 కోట్లు?

రచ్చ కల్లెక్షన్స్ 13 కోట్లు?

Published on Apr 7, 2012 4:09 PM IST

రామ్ చరణ్ తేజ్,తమన్నా జంటగా నటించిన చిత్రం “రచ్చ” ఈ మధ్యనే విడుదలయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్బుతమయిన కల్లెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజే 8 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం మరో 5 కోట్ల వరకు రెండవ రోజు వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు .రెండు రోజుల ఈ చిత్ర కల్లెక్షన్లు13 కోట్లు(షేర్ మాత్రమే). సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మొదటి రోజే ఈ చిత్రానికి బి మరియు సి కేంద్రాలలో అద్బుతమయిన స్పందన కనబడింది. ఇదే ఊపు కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు