సాంగ్ మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట !

సాంగ్ మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట !

Published on Jun 20, 2020 10:00 AM IST

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, అయితే గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోయాడనే కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం దేవి బన్నీ ‘పుష్ప’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, సాంగ్స్ అన్నీ పూర్తి సంతృప్తిగా ఉండబోతున్నాయట.

పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ఇక ఈ క్ర‌మంలో ఓ సాంగ్ ను రెడీ చేసి డైరెక్టర్ సుకుమార్ కి అండ్ బ‌న్నికి వినిపించ‌డం, వాళ్ళ‌కు సోంగ్ బాగా న‌చ్చ‌డం, హ్యాపీగా ఫీల‌వ‌డం కూడా జ‌రిగింద‌ట‌. ప్రస్తుతం దేవి ఐటమ్ సాంగ్ పుర్తి చేశాడ‌ట. సాంగ్ మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందట. మ‌రి సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు