పుష్ప కోసం భారీ సెట్స్?

పుష్ప కోసం భారీ సెట్స్?

Published on Jun 10, 2020 7:28 PM IST

ఇకపై షూటింగ్స్ అంత తేలికైన విషయం కాదు. దర్శక నిర్మాతలు తమకు ఇష్టం వచ్చిన ప్రదేశంలో, షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతి లేదు. ఇక ప్రభుత్వాలు జూన్ 15నుండి షూటింగ్స్ నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ అనేక ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే ప్రక్క రాష్ట్రాల్లో షూటింగ్స్ నిర్వహించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పెద్ద చిత్రాల నిర్మాతలు షూటింగ్స్ దాదాపు సెట్స్ తో మేనేజ్ చేసేలా చూస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ కోసం ఇప్పటికే రాజమౌళి ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సివుంది. అవి మినహాయించి మిగతా సన్నివేశాలు మరియు సాంగ్స్ చిత్రీకరణ కొరకు సెట్స్ నిర్మించే ప్రణాళికలో పుష్ప టీం ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు