బన్నీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను వీడని లీకుల బెడద.!

బన్నీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను వీడని లీకుల బెడద.!

Published on Feb 3, 2021 12:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. అయితే ఈ చిత్రంతోనే బన్నీ మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నా మేకర్స్ మాత్రం ఎందుకో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి ఏదొక లీక్ ఈ సినిమా నుంచి వస్తూనే ఉంది. మరి అలా ఆ మధ్యనే ఓ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించి సీన్ లీక్ అయ్యింది. అది మరిచే లోపే మళ్ళీ మరో సీక్వెన్స్ అలాగే సాంగ్ లీకయ్యిందని సోషల్ మీడియాలో టాక్ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనితో బన్నీ ఈ ప్రతిష్టాత్మక సినిమా సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనం ఇస్తుంది. మరి వీరి చిత్ర యూనిట్ ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారో వారికే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు