స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న రష్మిక తన కెరీర్‌లోనే పుష్ప సినిమా ప్రత్యేకమని.. పుష్పలో తానూ పోషించే పాత్ర తన సినీ జీవితంలోనే ఎప్పటికి నిలిచిపోతుందని చెబుతుందట. దానికి కారణం సినిమాలో రష్మికది ఓ గిరిజన యువతి పాత్ర అని, రష్మిక నటనలోని మరో కోణం ఈ పాత్ర ఎలివేట్ చేయబోతోందని.. అందుకే రష్మిక ఈ పాత్ర పై తెగ ఆసక్తి చూపిస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. ఇక సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో స్మగ్లింగ్ సీన్స్ అన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ గా ఉంటాయట.
ఇక ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో స్టార్ట్ చేస్తారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు.
అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఇప్పుడు అతని పాత్రలో మరో హీరోని తీసుకోవాలనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.