“పుష్ప” ఆల్బమ్ మరో లెవెల్లో ఉండబోతుందా.!

“పుష్ప” ఆల్బమ్ మరో లెవెల్లో ఉండబోతుందా.!

Published on Feb 6, 2021 1:00 PM IST

మన టాలీవుడ్ లో కొన్ని ఆల్ టైం హిట్ అండ్ సెన్సేషనల్ కాంబోలు ఉన్నాయి. ఇండివిడ్యుయల్ గా ఒక్కొక్కరు ఎన్ని సినిమాలు చేసినా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి ఆ కాంబో కనుక సెట్టైతే ఆ అంచనాలే వేరే లెవెల్లో ఉంటాయి. మరి అలాంటి కాంబోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ కూడా ఒకటి.

ఇప్పుడు ముచ్చటగా వీరి నుంచి “పుష్ప” అనే సాలిడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే వీరి కాంబో అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఎదురు చూసేది సంగీతం కోసమే..ఇప్పటికే వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయో తెలిసిందే. అందుకే పుష్ప పై అందులోనూ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో అంతకు మించిన స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

మరి ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దేవీ అవుట్ స్టాండింగ్ ఆల్బమ్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడట. ఇప్పటికే చాలా మేర పూర్తయ్యిందని లేటెస్ట్ ఇంటర్వ్యూ లో దేవీ తెలిపాడు. అంతే కాకుండా బన్నీ నుంచి కూడా పుష్ప ఆల్బమ్ పై సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని దేవి తెలిపాడు. మరి ఈ లెక్కన ఈ సెన్సేషనల్ కాంబో నుంచి వచ్చే ఆల్బమ్ మరో లెవెల్లో ఉండడం కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాల్లో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు