పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

Published on Oct 31, 2025 7:00 AM IST

ప్రేమకథా చిత్రాల శ్రేణిలో ‘ఏంటో అంతా సరికొత్తగా’ సినిమా ఫస్ట్ లుక్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురువారం లాంఛనంగా విడుదల చేశారు. యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రాము ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాము.ఎం నిర్మించారు. రాజ్ బోను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత ప్రధాన జంటగా నటించారు.

ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో అల్లిన అందమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కింది. టైటిల్‌కు అనుగుణంగానే, ఈ సినిమా నేపథ్యం విభిన్నంగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా, ఇందులో కథానాయకుడు, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పనిచేసే పాత్రల్లో కనిపిస్తారు. పల్లెటూరి ప్రశాంతత, టోల్ గేట్ వద్ద చోటుచేసుకునే సంఘటనలను కలగలిపి ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దారు.

చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కూల్‌గా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా రూపొందిన ‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రం త్వరలోనే మిగిలిన నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని, తమ విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

తాజా వార్తలు