‘లైగర్’ సినిమాలో ఆ స్టార్ కమెడియన్ కోసం సూపర్బ్ రోల్ రాసిన పూరి

‘లైగర్’ సినిమాలో ఆ స్టార్ కమెడియన్ కోసం సూపర్బ్ రోల్ రాసిన పూరి

Published on Feb 9, 2021 12:05 AM IST


పూరి జగన్నాథ్ సినిమాలంటే కమర్షియల్ అంశాలకు కొదవే ఉండదు. మాస్ ఎలివేషన్స్, మంచి పాటలు, ఫైట్స్, డైలాగులతో పాటు మంచి కామెడీ కంటెంట్ కూడ ఉంటుంది. ఆయన చేసిన ఏ సినిమా తీసుకున్నా వాటిలో మంచి కామెడీ ట్రాక్స్ ఉంటాయి. అలా పూరి తయారుచేసుకునే కామెడీ ట్రాకుల్లో ఎక్కువగా స్టార్ కమెడియన్ అలీ ఉంటుంటారు. పూరి మొదటి సినిమా ‘బద్రి’ మొదలుకుని ‘పోకిరి, శివమణి, సూపర్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, టెంపర్’ లాంటి చాలా సినిమాల్లో ఆలీకి ప్రత్యేకమైన క్యారెక్టర్లు రాశారు పూరి. అవన్నీ బాగా సక్సెస్ అయ్యాయి.

అందుకే తన కొత్త చిత్రం ‘లైగర్లో’ కూడ అలీ కోసం సూపర్ ఫన్ కామెడీ ట్రాక్ వేశారట ఆయన. ఇది కూడ బాగా వర్కవుట్ అవుతుందని, నవ్వులు పూయిస్తుందనే టాక్ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు టీమ్. తెలుగుతో పాటు హిందీలో కూడ ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో హైప్ మరింత పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు