పూరి జగన్నాథ్ అంటేనే వేగానికి కేరాఫ్ అడ్రెస్. ముహూర్తం రోజే రిలీజ్ డేట్ చెప్పేసి, చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేసే పర్ఫెక్షన్ ఆయనది. అందుకే ఆయనతో సినిమా అంటే ఎలాంటి ఇబ్బందీ ఫీలవరు నటీనటులు. కెరీర్ ఆరంభం నుండి ఇదే స్పీడ్ చూపిస్తున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న కొత్త చిత్రాన్ని కూడా అదే వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ సినిమాను ఇప్పటివరకు ముంబైలోనే షూటింగ్ చేశారు.
ఈ 40 రోజుల షెడ్యూల్ ను ప్లాన్ ప్రకారం ఎలాంటి డిలే లేకుండా కంప్లీట్ చేసేశారు పూరి. ఇందులో విజయ్, అనన్య పాండే, అలీ, రోనిత్ బోస్ రాయ్, రమ్యకృష్ణల మీద కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. పూరి స్పీడ్ చూస్తుంటే అనుకున్న గడువు కంటే ముందుగానే సినిమాను కంప్లీట్ చేసేలా ఉన్నారు. పూరి, ఛార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం పాలుపంచుకుంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హెవీగానే ఖర్చు పెడుతున్నారు