డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా యువతని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని అందుకుంది. నితిన్, ఆద శర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ పూరి టూరింగ్ టాకీస్ పై ఈ సినిమాని నిర్మించాడు.
ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల కాలంలో ఆయన్ని గర్వంగా ఫీలయ్యేలా చేసిన సందర్భం ఏమిటని అడిగితే ‘ ఇందుకోసం నేను ఫేమస్ స్క్వాష్ ప్లేయర్ అయిన లక్ష్మీ శృతి సెట్టిపల్లి గురించి చెప్పాలి. స్వతహాగా తెలుగమ్మాయి అయిన తను చెన్నైలో సెటిల్ అయ్యింది. తను ఇప్పటి వరకూ ఎన్నో ఇంటర్నేషనల్ టోర్నీలు గెలుచుకుంది. ఆమె ఇప్పటి వరకూ 150 సార్లు ‘బిజినెస్ మేన్’ సినిమా చూసింది. తను కాస్త కష్టతరమైన మ్యాచ్ ఆడటానికి ముందు తనని తాని మోటివేట్ చేసుకోవడానికి ఈ సినిమా చూస్తానని చెప్పింది. అది నాకు ఎంతో గర్వంగా అనిపించిందని’ అన్నాడు.