పవన్ మూవీ కథపై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ

దర్శకుడు హరీష్ శంకర్ పవన్ హీరోగా చేస్తున్న మూవీ పై వస్తున్న పుకారుని సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అందులో ఎటువంటి నిజం లేదని ఆయన కొంచెం గట్టిగానే చెప్పారు. కొద్దిరోజుల క్రితం పవన్ తన 28వ చిత్రాన్ని ప్రకటించారు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా హరీష్ ఈ చిత్రం కోసం పవన్ ఇమేజ్ కి సరిపోయే ఓ రీమేక్ సబ్జెక్టు వెతికే పనిలో పడ్డారని ఓ మీడియా సంస్థ కథనం రాయడం జరిగింది.

ఆ కథానానికి ప్రతిస్పందనగా దర్శకుడు హరీష్ మీ రిపోర్ట్స్ అందరూ నాకు తెలిసినవారే. వారికి నాతో పరిచయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా నాపై కథనం రాసే ముందు నన్ను సంప్రదించవచ్చు అని వ్యంగ్యంగా స్పందించారు. గతంలో పవన్ తో ఆయన చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా అది హిందీ మూవీ దబంగ్ కి తెలుగు రీమేక్. ఇక గత ఏడాది హరీష్ హీరో వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ తమిళ్ హిట్ మూవీ జిగర్తాండకు అధికారిక రీమేక్. దీనితో పవన్ తో ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీ కూడా రీమేక్ అని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన వాటన్నింటికీ చెక్ పెట్టారు.

https://twitter.com/harish2you/status/1224583251097870336

Exit mobile version