రితేష్ దేశ్ ముఖ్ సరసన నటించబోతున్న ప్రియమణి?

రితేష్ దేశ్ ముఖ్ సరసన నటించబోతున్న ప్రియమణి?

Published on Feb 18, 2012 11:00 AM IST


తాజా సమాచారం కనుక నిజమయితే ప్రియమణి రితేష్ పక్కన కథానాయికగా నటించడానికి అన్ని సిద్దమయినట్టే. ప్రస్తుతం ఈ విషయం పై దర్శకుడు చంద్రకాంత్ సింగ్ తో చర్చల్లో ఉన్నారు. దాదాపుగా ఈ చిత్రం లో ప్రియమణి చేస్తున్నట్టు సమాచారం. గతంలో “రావన్” మరియు “రక్త చరిత్ర” రెండు చిత్రాలు చేసిన ప్రియమణి ఇంతవరకు విజయం రుచి చూడలేదు. ప్రస్తుతం ఈ భామ కన్నడం లో “అన్న బాండ్” అని ఒక చిత్రం మలయాళం లో “గ్రాండ్ మాస్టర్” అని మరో చిత్రం చేస్తున్నారు తెలుగు లో త్వరలో ఒక కథానాయిక ప్రాదాన్యమున్న చిత్రం చేయ్యబోతున్నట్టు కూడా సమాచారం.

తాజా వార్తలు