షారుక్ తో స్టెప్పులేయడానికి బయలుదేరిన ప్రియమణి

Priyamani
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రాబోయే “చెన్నై ఎక్స్ ప్రెస్” సినిమాలో ఐటెం సాంగ్ షూటింగ్ లో పాల్గొనడానికి ప్రియమణి చాలా ఉత్సాహం చూపిస్తోంది. దీనికి గానూ కొన్ని వారాల క్రితమే ఆమెను అడిగితే బాగా ఆలోచించి ఆమె ఈ ఆఫర్ ను అంగీకరించింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్సకత్వం వహిస్తున్నాడు. ఈ పాట రేపు మహారాష్ట్ర సమీపంలో ‘వాయ్’ అనే ప్రదేశంలో చిత్రీకరించనున్నారు. “మరికొద్దిసేపట్లో పూణే!!! అక్కడనుండి వాయ్!! చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ రేపటినుండి మొదలుకానుంది. చాలా ఉత్సాహంగా, కిక్ గా ఉంది… ఫుల్ ఊపున్న పాట” అని ప్రియమణి ట్వీట్ చేసింది.

గత కొన్ని రోజులగా తను హైదరాబాద్లో సముద్ర రాబోయే సినిమా ‘చండి’ షూటింగ్లో బిజీగా ఉంది. ప్రియమణి, దీపక్ ప్రధాన పాత్రు పోషిస్తున్నారు. ప్రియమణి ఈ చిత్రంలో ఒక యాక్షన్ రోల్ చేస్తుంది. దీనికి గానూ అర్చరి శిక్షణ కుడా తీసుకుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 16న పూర్తి కాగా తరువాత షెడ్యూల్ ఫిబ్రవరి 27న మొదలై మార్చి 15 వరకూ కొనసాగనుంది.

Exit mobile version