లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియ ఆనంద్ చివరగా కథానాయికగా “కో అంటే కోటి” చిత్రంలో కనిపించింది. తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ఒకటి తెలుగులోకి అనువాదమవుతుంది. “1,2,3,4” అనే పెరుతో రానున్న ఈ చిత్రానికి “అందరు ఇంజనీర్లె” అన్నది ఉపశీర్షిక. తమిళంలో “పుగై పడం” అన్న పేరుతో వచ్చిన ఈ చిత్రానికి రాజేష్ లింగం దర్శకత్వం వహించారు సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ మీద ఆర్ సత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. కాలేజిలో చదువుకునే ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగే కథ ఈ చిత్రం. కోడైకనాల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి గంగై అమరాన్ సంగీతం అందించారు. గతంలో ఈ చిత్రానికి “ఎబిసిడి” అనేపేరు పరిశీలించగా తాజాగా “1,2,3,4”కి మార్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చెయ్యనున్నారు. ఇదిలా ఉండగా ప్రియ ఆనంద్ ప్రస్తుతం హిందీలో “రంగ్రేజ్” మరియు “ఫఖ్రే” చిత్రాలు చేస్తుండగా తమిళంలో “ఎదుర్ నీచల్” చిత్రాన్ని చేస్తున్నారు.
ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలో “1,2,3,4”
ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలో “1,2,3,4”
Published on Feb 1, 2013 1:43 AM IST
సంబంధిత సమాచారం
- తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?
- యూఎస్ మార్కెట్ లో ‘మిరాయ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్!
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- ‘ఓజి’కి ఏపీలో ముందే షో పడనుందా?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?