ఈ నెల 13న నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

ఈ నెల 13న నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

Published on Nov 11, 2013 1:51 PM IST

Audio-Release_Poster_Pratin
యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల గురించి చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాకి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తను దర్శకత్వం వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా ఆడియో ని ఈ నెల 13న విడుదల చేయనున్నారు. ఆనంద్ రవి స్క్రిప్ట్ ను అందించిన ఈ సినిమాని జే. సాంబశివ రావు నిర్మిస్తున్నాడు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన శుబ్ర ఐయప్ప హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటులు కోట శ్రీనివాస్ రావు, గిరిబాబు, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ మొదలగు వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

తాజా వార్తలు