యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం పై దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే ఈ సినిమా ఎలా లైన్ మరియు స్టోరీ కోసం.
గతంలోనే ఆల్రెడీ ఓసారి క్లారిటీ ఇచ్చిన నీల్ మళ్ళీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఈ సినిమా దేనికీ రీమేక్ కాదు, సీక్వెల్ కూడా కాదు అలాగే ఏ హాలీవుడ్ బాలీవుడ్ సినిమా కాపీ కూడా కాదని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇది పూర్తిగా ఒక్క ప్రభాస్ కోసం రాసి డెవలప్ చేసిన కథ అని మరో అదనపు అంశాన్ని నీల్ బయట పెట్టినట్టు టాక్. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె నిర్మాణ సంస్థ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.