తమ ఇండస్ట్రీ విషయంలో ప్రశాంత్ నీల్ డిమాండ్.!

తమ ఇండస్ట్రీ విషయంలో ప్రశాంత్ నీల్ డిమాండ్.!

Published on Feb 3, 2021 2:00 PM IST

కేజీయఫ్ అనే సినిమా కోసం మన దేశంలోనే తెలియని ఏ సినీ ప్రేమికుడు ఉండడని చెప్పడంలో ఎలాంటి అతిశెయోక్తి లేదు. మరి ఇప్పుడు చాప్టర్ 2 తో మరింత స్థాయిలో భారీ ఎత్తున పాపులారిటీ సంతరించుకుంది. అయితే మరి ఈ సాలిడ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ఓ రేంజ్ లో వ్యాప్తి చెందింది.

అయితే ఈ సెన్సేషనల్ దర్శకుడు తన కన్నడ ఇండస్ట్రీ కోసం వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్లా కూడా థియేటర్స్ 100 శాతం సీటింగ్ కు అనుమతులు ఇవ్వగా ఇంకా ఇక్కడ ఇవ్వకపోవడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్ ఆక్యుపెన్సీ డిమాండ్ చేస్తుంది అనే హ్యాష్ టాగ్ తో సినిమా చాలా మందికి జీవితాన్ని కూడా ఇస్తుంది అని తన భావాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. మరి ఈ డిమాండ్స్ పై కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి స్పందనను తెలియజేస్తుందో చూడాలి..

https://twitter.com/prashanth_neel/status/1356838276645023745?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు