ప్రతినిధి సక్సెస్ పై నమ్మకంగా ఉన్న ప్రశాంత్

ప్రతినిధి సక్సెస్ పై నమ్మకంగా ఉన్న ప్రశాంత్

Published on Nov 24, 2013 10:30 AM IST

Pratinidhi
నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ సినిమా ద్వారా ప్రశాంత్ మండవ డైరెక్టర్ గా తెలుగు వారికి పరిచయం కానున్నాడు. ఇప్పటికే విదుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకి బాగా నచ్చడంతో అందరూ ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా స్టొరీ కూడా కాస్త కొత్తగా ఉంది. ప్రతినిధి సినిమా ఓ కామన్ మాన్ 84 పైసల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి, మొత్తం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే అంశం చుట్టూ తిరుగుతుంది.

ప్రశాంత్ మండవ గత 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మీరు డైరెక్టర్ గా సినిమా చేయడానికి ఎందుకిత ఎక్కువ సమయం పట్టిందని ప్రశాంత్ మండవని అడిగితే ‘ సినిమా ఎలా తీయాలి అనేది ఎవరి దగ్గరన్నా రెండు సినిమాలకి పనిచేస్తే చాలు తెలిసిపోతుంది, కానీ చాలా మంది జీవనాధారం కోసం అలానే పనిచేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తన మొదటి సినిమాకి ముందు ఎవరి దగ్గర పనిచెయ్యలేదు. ప్రతినిధి చాలా వండర్ఫుల్ స్టొరీ. అలాగే సినిమా సక్సెస్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నానని’సమాధానం ఇచ్చాడు.

ప్రతినిధి సినిమాని కేవలం 29 రోజుల్లో తీసేశారు. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దేనని ఈ చిత్రం టీం అంటోంది. ఆనంద్ రవి కథ అందించిన ఈ సినిమాలో సుభ్ర అయ్యప్ప నారా రోహిత్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. జె. సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు