ఓజీ ఫ్యాన్స్.. చొక్కాలు తెచ్చుకోండయ్యా..!

OG movie Review
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే, హైదరాబాద్‌లోని ప్రసాద్స్ థియేటర్ యాజమాన్యం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పవన్ ఫ్యాన్స్‌కు ఓ సూచన చేసింది.

పవర్ స్టార్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారని.. థియేటర్లలో ఈలలు, చప్పట్లతో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ తమ చొక్కాలు సైతం చింపుకుంటున్నారని.. అందుకే అభిమానులు అదనంగా మరో చొక్కా తమతో పాటు తెచ్చుకోవాలంటూ సూచించింది.

దీంతో ఓజీ చిత్రం ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version