‘అత్తారింటికి దారేది’ సినిమా విజయంతో ఆనందంలో వున్న ప్రణీతకు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఎంటెర్టైనర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లో మనోజ్ సరసన నటించడమే కాక ఎన్.టీ.ఆర్ ‘రభస’లో రెండో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది
తాజా సమాచారం ప్రకారం ఒక అవార్డు వేడుకలో ఈమెకు ‘ఫేస్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వచ్చింది. ప్రస్తుతం పలు దర్శక నిర్మాతలతో మాటలలో ఉన్న ఈ భామ తదుపరి సినిమాలను ఆచి తూచి అంగీకరిస్తుంది. త్వరలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ‘బ్రహ్మ’లో కనిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో మంచి ఆదరణను పొందింది