టబుతో ఉలవచారు బిరియాని అంటున్న ప్రకాష్ రాజ్??

టబుతో ఉలవచారు బిరియాని అంటున్న ప్రకాష్ రాజ్??

Published on Nov 17, 2012 9:40 AM IST

ప్రకాష్ రాజ్ టబుతో కలిసి ఒక చిత్రం చేయ్యనున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. “ఉలవచారు బిరియాని” పేరుతో రానున్న ఈ చిత్రానికి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు మలయాళంలో “సాల్ట్ N పెప్పర్” పేరుతో వచ్చి విజయవంతమయిన చిత్రానికి ఈ చిత్రం రీమేక్. మలయాళంలో లాల్, శ్వేత మీనన్, ఆసిఫ్ అలీ మరియు మైథిలి లు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్, లాల్ పాత్రలో నటిస్తుండగా టబు, శ్వేతా మీనన్ పాత్రలో నటించనున్నారు మిగిలిన రెండు పాత్రలలో ఎవరు నటిస్తారు అనేది వెల్లడించలేదు. గతంలో “ధోని” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ మరియు హిందీ భాషలలో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తుండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్నిఅందిస్తున్నారు. ఉలవచారు బిరియాని అనేది తెలుగు వారికి బాగా చేరువయ్యే టైటిల్ ఈ చిత్రానికి “లవ్ ఈజ్ కుకింగ్” అనే కాప్షన్ కూడా ఉంది.

తాజా వార్తలు