పవన్, రాజమౌళి పై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

పవన్, రాజమౌళి పై ప్రగ్యా జైస్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on May 17, 2020 8:50 PM IST

టాల్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఈ లాక్ డౌన్ లో అభిమానుల కోరిక మేరకు వారితో ‘అస్క్ ప్రగ్యా’ అంటూ ట్విట్టర్ లో సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని ‘ మీ డ్రీమ్ రోల్ మరియు మీ డ్రీం డైరెక్టర్ గురించి, అలాగే ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు ?’ అని అడగగా.. ‘ఎస్.ఎస్.రాజమౌళి సర్, మరియు సంజయ్ లీలా భన్సాలీ సర్’ తన డ్రీం డైరెక్టర్స్ గురించి చెప్పింది.

మరో అభిమాని ‘తెలుగు ఇండస్ట్రీ గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు ?’ అని అడగగా.. ‘తెలుగు ఇండస్ట్రీ నా హోమ్’ అంటూ ప్రగ్యా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఇంకో అభిమాని ‘మీకు టీ మరియు కాపీలో ఏది ఇష్టం ?’ అని అడగగా.. ‘టీ’ అని చెప్పుకొచ్చింది. ఇక ‘మీరు నటి కాకపోయి ఉంటే ఏమైయ్యేవారు ?’ అడగగా ‘లాయర్ అయ్యేదాన్ని’ అని చెప్పింది.

‘పవన్ కళ్యాణ్’ గురించి ఒక్క వర్డ్ లో చెప్పమని ఓ అభిమాని కోరగా.. ప్రగ్యా సమాధానం ఇస్తూ.. ‘పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు’ అని తెలిపింది. అలాగే మరో అభిమాని ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఫ్రాంక్ చేయాలనుకుంటే ఎవర్ని చేస్తారు’ అని అడగగా.. ‘రానా’ని అంటూ సమాధానం ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు