పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుంచి టీజర్‌ను నిన్న(జూన్ 16) గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో ప్రొడ్యూసర్ SKN కూడా పాల్గొన్నారు. అయితే, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు నిర్మాత SKN వేసుకున్న టీ-షర్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆయన వేసుకున్న టీ-షర్ట్‌పై ‘జాతిని..’ అనే పదం ఉండటంతో ఇది కొత్త వివాదానికి దారి తీస్తుందని అందరూ భావించారు.
అయితే, ఆయన వేసుకున్న టీ-షర్ట్ పై ఆ పదం ఎందుకు ఉందో అసలు విషయం తెలిపారు SKN. ఈ టీ-షర్ట్‌పై ఉన్న పదం ఎవరినీ, ఏ కులాన్ని ఉద్దేశించింది కాదని.. ఈ సినిమాలో ఓ పాటలో ఈ పదం ఉంటుందని.. అందుకే, ఆయన ఈ విధంగా టీ-షర్ట్ వేసుకుని వచ్చినట్లు తెలిపారు. సినిమాలోని పాటను ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ టీ-షర్ట్ వేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఏదేమైనా తనదైన స్పీచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే SKN ఈసారి ఇలా టీ-షర్ట్ పై ఉన్న క్యాప్షన్‌కు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక రాజాసాబ్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.