మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమయ్యారు. హీరో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీలంకకు బయల్దేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, శ్రీలంక షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 26, 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


