ఫౌజీ మూవీపై ప్రదీప్ రంగనాథన్ లీక్.. ఏమిటో తెలుసా?

ఫౌజీ మూవీపై ప్రదీప్ రంగనాథన్ లీక్.. ఏమిటో తెలుసా?

Published on Oct 14, 2025 3:00 AM IST

Pradeep Ranganathan

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ లీక్ ఇచ్చాడు.

ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ వారు తనకు ఫౌజీ చిత్రంలోని కొన్ని సీన్స్ చూపెట్టారు.. వారి ప్యాషన్‌కు తాను ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ దాదాపు ఖరారు చేయబోతున్నారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు