చిరు కోసం బాబీ డబుల్ బ్లాస్ట్..?

చిరు కోసం బాబీ డబుల్ బ్లాస్ట్..?

Published on Oct 13, 2025 11:01 PM IST

Bobby-Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవితో తన నెక్స్ట్ మూవీని దర్శకుడు బాబీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు మరోసారి చిరుతో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ, ప్రస్తుతం ఈ సినిమా కోసం క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడట. కాగా, ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు అందాల భామలు రొమాన్స్ చేసేందుకు రెడీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఇద్దరు హీరోయిన్ల వేటలో బాబీ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందాల భామ రాశి ఖన్నాను బాబీ సంప్రదించాడట. పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న రాశి, చిరుతో సినిమాకు ఓకే చెప్పడం ఖాయంగా తెలుస్తోంది.

అటు మరో హీరోయిన్‌గా అందాల భామ మాళవిక మోహనన్‌ను తీసుకునేందుకు బాబీ ప్రయత్నిస్తున్నాడట. మరి ఈ మలయాళ బ్యూటీ ఈ మెగా ఛాన్స్‌కు ఓకే చెబుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.

తాజా వార్తలు