జాక్‌పాట్ కొట్టేసిన ‘లిటిల్ హార్ట్స్’ హీరో..?

జాక్‌పాట్ కొట్టేసిన ‘లిటిల్ హార్ట్స్’ హీరో..?

Published on Oct 14, 2025 1:30 AM IST

Mouli-Tanuj

యూట్యూబ్‌ స్టార్ మౌలి తనుజ్ ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు కూడా రాబట్టాడు ఈ హీరో. ఇక ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మౌలి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేవలం ఒక్క సినిమాతో ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, పరిశ్రమలో ఇదేమీ కొత్త కాదని.. ఒక్క హిట్టుతో మంచి క్రేజీ ప్రాజెక్ట్ పట్టుకున్న వారు చాలా మంది ఉన్నారని.. అయితే, నిర్మాతలు కూడా తమకు నమ్మకం కుదిరిన తర్వాతే సదరు హీరోకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తారనేది ఇండస్ట్రీ టాక్.

అయితే, ఇదే మైత్రీ సంస్థ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘డ్యూడ్’ కోసం ఏకంగా రూ.13 కోట్ల మేర రెమ్యునరేషన్ అందించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ‘లిటిల్ హార్ట్స్’ హార్ట్స్ హీరో జాక్‌పాట్ కొట్టాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

తాజా వార్తలు